మ‌హా సంప్రోక్ష‌ణ‌కు స‌ర్వం సిద్ధం

* నేటి నుంచి ఆర్జిత సేవ‌ల ర‌ద్దు
* ద‌ర్శ‌నాల సేవ‌లు ప‌రిమితం
ఏపీ టాప్ న్యూస్‌: మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మానికి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం సిద్ధ‌మైంది. ఈ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి అంకురార్ప‌ణ‌తో ఈ కార్య‌క్ర‌మం లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. గ‌ర్భాల‌యాన్ని శుద్ధి చేసి, మ‌ర‌మ్మ‌తులు చేసి, మూల విగ్ర‌హాన్ని ప‌టిష్ట‌ప‌రిచే ప్ర‌క్రియ ప్ర‌తి ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగుతోంది. 60 ఏళ్లుగా సాగ‌తున్న ఈ మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మంలో అష్ట‌బంధ‌నం అత్యంత ముఖ్య‌మైన‌ది.

16న ముగిసే ఈ పుష్క‌ర‌కాల క్ర‌తువులో రుత్వికులు, వేద‌పండితులు వంద‌లాది మంది పాల్గొంటారు. ఈ ఆరు రోజులూ ప‌రిమిత‌మైన‌సంఖ్య‌లోనే భ‌క్తుల‌ను శ్రీ‌నివాసుడి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. కాగా టీటీడీ రికార్డుల మేర‌కు 1958, 1970, 1982, 1994, 2006లో మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. తాజాగా 2018 ఈ నెల 12 నుంచి 16వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

Share