ముసుగు తొలిగింది భీమిలి నుంచి జేడీ?

ఏపీ టాప్ న్యూస్‌: సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. రాయ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం మ‌న‌మంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌ని కూడా ఆ మ‌ధ్య పుకార్లు షికార్లు చేశాయి. కాగా అవ‌న్నీ ఉత్తిదేన‌ని తేలిపోయింది. ముసుగు తొల‌గిపోయింది. ప్ర‌తిప‌క్ష పార్టీ విమ‌ర్శిస్తున్న‌దే నిజ‌మ‌ని తేలిపోయింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసు విష‌యాల్లో అప్పుడు వైసీపీ నాయ‌కులు జేడీ ల‌క్ష్మినారాయ‌ణ తెలుగుదేశం పార్టీ వ్య‌క్తి అని, చంద్ర‌బాబుతో ఆయ‌న‌కుసంబంధాలు ఉన్నాయ‌ని గ‌తంలో చాలామార్లు ఆరోపించారు. ఇప్పుడు ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం ఆధారంగా చూస్తే అదే నిజ‌మ‌నిపిస్తోంది. కాగా జేడీ ల‌క్ష్మినారాయ‌ణ టీడీపీలో చేర‌బోతున్నార‌ని, ఆ పార్టీ వ‌ర్గాల స‌మాచారం అని ఓ ప్ర‌ముఖ ప‌త్రిక రాసింది. జేడీ విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంద‌ని, తొలుత ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్‌ పోటీ చేయాలని భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం.
కాగా హైదరాబాద్‌లో సీబీఐ సంయుక్త సంచాలకుడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ వైయ‌స్ జ‌గ‌న్‌పై పెట్టిన కేసును దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన ప్రభుత్వ సర్వీస్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నా ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో తెదేపా చొరవ తీసుకుని ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. లక్ష్మీనారాయణ, సీనియర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెదేపాలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.

Share