21న `వెన్నుపోటు` సాంగ్‌

ఏపీ టాప్ న్యూస్‌: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ చిత్రం తీస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. అస‌లే వివాదాల‌తో లెక్క‌చేయ‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ చిత్రంలో ఎలాంటి స‌న్నివేశాల‌ను పెడ‌తారోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి వెన్నుపోటు సీను త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని, ఒక‌వేళ ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాల‌ని త‌ర్జ‌న బ‌ర్జ‌న ప‌డుతున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రానికి సంబంధించి `వెన్నుపోటు` అనే పాట ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని ముందుగానే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Share