బిగ్ బాస్ విజేత కౌశల్

ఏపీ టాప్ న్యూస్‌: 113 రోజులు.. 8 మంది కంటెస్టెంట్స్.. ఎత్తులకు పైఎత్తులు.. ఎలిమినేషన్ టాస్క్‌లు.. కెప్టెన్ సమరాలు.. అదిరిపోయే అందాలు.. ఆకట్టుకునే పెర్ఫామెన్స్‌లు.. అక్కడక్కడా బోరింగ్.. అంతలోనే బోలెడు కాంట్రవర్శీలతో సాగిన బిగ్‌బాస్‌-2 విజేత ఎవ‌రో తెలిసిపోయింది. ఇది అంద‌రూ ఊహించిన‌ట్లుగా జ‌రిగింది. చివ‌రి రోజు ముఖ్యఅతిథిగా వ‌చ్చిన విక్ట‌రీ వెంక‌టేష్‌, నానిలు విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. బిగ్‌బాస్‌-2 విజేతగా కౌశ‌ల్‌ను ప్ర‌క‌టించారు. గీతామాధురి ర‌న్న‌ర్‌గా నిలిచారు. కాగా తనీష్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి, కౌశల్‌లు ఫైనల్‌కి చేరుకోవడంతో టైటిల్ పోరు నువ్వా.. నేనా అంటూ సాగింది. ‘ఏదైనా జరగొచ్చు.. ఇంకాస్త మసాలా.. అదిరిపోయే డాన్స్‌లు.. ఆకట్టుకునే పెర్ఫామెన్స్.. బిగ్ బాస్ స్టేజ్‌‌ని షేక్ చేస్తున్న దీప్తి సునయన కిరాక్ పెర్ఫామెన్స్.. తేజస్విని, భాను శ్రీ, నందినిల హాట్ షో.. నేచురల్ స్టార్ స్టన్నింగ్ పెర్ఫామెన్స్.. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్.. ఊహించని ట్విస్ట్‌.. ఇదీ బిగ్ బాస్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌లో ఇలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

అయితే 113 రోజుల పాటు ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉండి, ఒంటరి పోరాటం చేసి విజేతగా నిలిచిన కౌశల్ తన దాతృత్వం చాటాడు. బిగ్‌బాస్ విజేతగా గెలుచుకున్న ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్ల కోసం ఉపయోగిస్తానని ప్రకటించాడు. ఈ నిర్ణయానికి కౌశల్ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. కౌశల్ మంచి నిర్ణయం తీసుకున్నాడని కొనియాడుతున్నారు.

Share