కౌశ‌ల్‌కు డాక్ట‌రేట్ ఇస్తున్నార‌ట‌

ఏపీ టాప్ న్యూస్‌: “మన కౌశల్ ఆర్మీ సభ్యులందరికీ పేరు పేరునా నమస్తే.. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్, అది ఏంటంటే.. మీ కౌశల్‌కి తొందరలో డాక్టరేట్ రాబోతుంది. ఎందుకు రాబోతుందన్నది సస్పెన్స్. అది మీకు త్వరలో రివీల్ చేస్తాను. నాకు డాక్టరేట్ ఇస్తున్నట్టు హార్వెస్ట్ బైబిట్ ఇన్స్‌స్టిట్యూట్ నుండి అధికారిక సమాచారం వచ్చింది. ఈ డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారన్న విషయాన్ని మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తా అప్పటి వరకూ వెయిట్ చేయండి“ అంటూ బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక బిగ్ బాస్‌తో పాటు ఇతర రియాల్టీ షోల్లో ఇప్పటి దాకా ఎవరికీ రానన్ని ఓట్లు వచ్చినందుకు గానూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరుస్తున్నారంటూ ఇటీవల ప్రకటించిన కౌశల్.. తనకు డాక్టరేట్ కూడా రాబోతుందని అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అయితే కౌశ‌ల్‌కు డాక్ట‌రేట్ ఇస్తున్నార‌న్న విష‌యం అత‌న్ని ద్వేషించే వాళ్లకు మింగుడుపడని విషయమే అయినా.. కౌశల్ ఫ్యాన్స్‌కి మాత్రం రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.

Share