`మీ టూ` గురించి మీ కూతురికి ఇదే చెప్తారా?

ఏపీ టాప్ న్యూస్‌:  టాలీవుడ్ హీరోయిన్ చాలా తెలివైంద‌ని సీని వ‌ర్గాల టాక్‌. అందుకే కాబోలు కేరీర్ బిగినింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో `మీ టూ` వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో త‌న‌కు ట్వీట్ చేసిన ఒక వ్య‌క్తిపై స‌మంత ఇచ్చి రిప్లై చూస్తే వారెవ్వా అన‌కుండా ఉండ‌లేరు. వివ‌రాల్లోకి వెళ్లితే…`మీటూ` ఉద్యమాన్ని సమర్ధిస్తూ ట్విట్టర్ వేదికపై రియాక్ట్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ సమంతకు గౌరవ్‌ ప్రధాన్‌ అనే నెటిజన్‌ ఓ అసక్తికర ట్వీట్ చేశాడు.  `మీటూ`పై తన కొడుకుతో జరిగిన  సంభాషణను ఇక్కడ ప్రస్తావించాడు గౌర‌వ్ ప్ర‌ధాన్‌.  సమంతను ఉద్దేశించి మాట్లాడుతూ `ఈరోజు మా అబ్బాయి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. `డాడీ అసలు ఈ `మీటూ` అంటే ఏంటి?` అని ప్రశ్నించాడు… అప్పుడు నేను దీనికి బదులిస్తూ  `మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్‌ బీమా పథకం` అన్నాను. దీనికి మా అబ్బాయి  `అదెలా?` అని మరో సారి  ప్రశ్నించాడు. ` ఆడవారు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్‌ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకర్లు వార్తలిస్తుంటారు.` అని చెప్పాను. ఇది విని మా అబ్బాయి `గాడ్‌ బ్లెస్‌ ఇండియా` అన్నాడు` అని గౌరవ్‌ పేర్కొన్నాడు. `మీటూ` ఉద్యమంపై నెటిజన్  గౌరవ్‌ ప్రధాన్‌ హ్యూమరస్ గా చెప్పిన వ్యాఖ్యలపై  సమంత కాస్త ఘాటుగానే ప్రతి స్పందించింది…..`ఇదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెప్తారు?` అని ప్రశ్నించింది.

Share