తిత్లీ బాధితుల‌కు టాలీవుడ్ హీరోల సాయం

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. జిల్లా వాసుల‌ను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు రూ. 15 లక్షలు ఇస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న, హీరో కల్యాణ్ రామ్ కూడా తనవంతు సాయంగా రూ. 5 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్టు ప్రకటించారు. వరుణ్ తేజ్ రూ.5 లక్షలు ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ బాధితులకు ఆదుకునేందుకు ఏకంగా రూ. 5 లక్షలు విరాళం ఇచ్చి తనలోని ఉదారవాదాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షల విరాళాన్ని పంపించాడు. “ తుపాను బాధితులను ఆదుకునేందుకు చేతులు కలుపుదాం రండి… సాయం కోసం ప్రతి ఒక్కరూ కదలాలని విజ్ఞప్తి చేస్తున్నా… గతంలో కేరళ కోసం చేశాం… ఇప్పుడు మన శ్రీకాకుళం వాసులను ఆదుకుందాం పదండి. బాధితులకు నేను అండగా నిలబడతా. మీరు మీ వంతు సాయం అందించి సాయపడండి“ అంటూ హీరోలు ట్వీట్లు చేస్తున్నారు. వీళ్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని మునుముందు మ‌రెంత‌మంది స్పందిస్తారో చూడాలి.

Share