`అర‌వింద స‌మేత‌` కాపీ క‌థేనా?

ఏపీ టాప్ న్యూస్‌: జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాపీ కొట్టారా? క‌థలోని చాలా వాటిని వాడుకుని క‌నీసం ఆ ర‌చ‌యిత పేరు కూడా వేయ‌కుండా మోసం చేశాడా? అంటే అవున‌నే అంటున్నారు ర‌చ‌యిత‌, కేంద్ర సాహిత్య అవార్డు గ్ర‌హిత డాక్ట‌ర్ వేంప‌ల్లి గంగాధ‌ర్‌. త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన గంగాధ‌ర్ ఏమంటున్నారంటే.. తాను రాసిన పుస్తకాల గురించి తెలుసుకున్న త్రివిక్రమ్ ఓ సారి ఫోన్ చేసి రమ్మన్నారని, అలా ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో ఆయనను కలిశానని గంగాధర్ అంటున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై పరిశోధన చేసి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందిన విషయం విని, తనను త్రివిక్ర‌మ్ అభినందించారని చెప్పాడు. ఇక తన హిరణ్య రాజ్యం పుస్తకంలోని కథనాన్ని హీరోయిన్ పాత్రకు వాడుకున్నారని.. అలాగే మొండి కత్తిలోని కథను వాడుకొని అరవింద సమేతను తెరకెక్కించాడని విమర్శించాడు. త్రివిక్రమ్‌ను కలిసి, తన కథల గురించి లోతుగా చెప్పడం తాను చేసిన మొదటి తప్పని గంగాధర్ చెప్పాడు. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడని, రకరకాల కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగలించి కొత్త కథను అల్లగడని, అలా వండిన మరో కథే అరవింద సమేత అని చెప్పాడు.
కాగా త్రివిక్రమ్‌పై విమర్శలు రావడం కొత్తేం కాదు. ‘అతడు’, ‘జులాయి’లోని చాలా సన్నివేశాలు హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేసినవనీ.. ప్రముఖ రచయిత యద్ధలపూడి సులోచనారాణి రచించించిన ‘మీనా’ అనే నవలతో ‘అఆ’ను తెరకెక్కించి ఆమెకు గుర్తింపు ఇవ్వలేదని(ఇదే నవల ఆధారంగా విజయ నిర్మల 1973లో ‘మీనా’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు), ఇక ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్‌’ రీమేక్ రైట్స్ తీసుకోకుండా ‘అఙ్ఞాతవాసి’గా తెరకెక్కించారని ఇలా చాలా విమర్శలే ఉన్నాయి. మరి అప్పటి విమర్శలు పక్కనపెడితే.. కొత్త వివాదంపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Share