అనుష్క‌ పెళ్లిపీట‌లెక్క‌నుందా?

ఏపీ టాప్ న్యూస్‌: టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్‌ లిస్ట్‌లో ఉన్న అనుష్క శెట్టి త్వరలో పెళ్లిపీటలెక్కనుందా..? ఈ ప్రశ్నను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో క్లూ ఇచ్చినట్లైంది. కాలి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఓ ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనుష్క. దానికి ‘క్యాప్షన్ అవసరం లేదు’ అంటూ ఓ కామెంట్ పెట్టింది. దీంతో త్వరలో పెళ్లి కబురు వినిపించబోతున్నారా..? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి అనుష్క పోస్ట్ వెనుక అసలు కారణమేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ ఏడాది మొదట్లో భాగమతి తరువాత అనుష్క ఏ చిత్రంలో కనిపించలేదు. సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ప్రస్తుతం దానిని తగ్గించుకునేందుకు సహజ సిద్ధమైన థెరపీలు తీసుకుంటుందని తెలుస్తోంది. త్వరలోనే అనుష్క ఇటు తెలుగులో నానితో కలిసి ఓ చిత్రంలో, అటు తమిళ్‌లో మాధవన్‌తో కలిసి మరో సినిమాలో నటించనున్నట్లు టాక్.

Share