మ‌న‌సున్నోడు!

ఏపీ టాప్ న్యూస్‌: క‌ష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవ‌డంలో ముందువ‌రుస‌లో ఉంటారు ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు హీరో విశాల్‌. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న‌వంతు సాయం చేస్తారు. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రైతుల‌కు త‌న ”అభిమన్యుడు” సినిమా ఒక్కో టికెట్‌పై రూపాయి చొప్పున అందించి త‌న ఔదార్యాన్ని చాటుకున్నాడు. తాజాగా వ‌ర్షాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న కేర‌ళ వాసుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. ‘కేరళ రెస్క్యూ’ పేరుతో రేపు చెన్నైలోని మహాలింగపురంలోవిరాళాలు సేక‌రించ‌నున్న‌ట్లు చెప్పారు.
వయనాడ్‌ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించేందుకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలీఫ్‌ మెటీరియల్స్‌ను తీసుకుంటామ‌ని, దాత‌లు ముందుకు వ‌చ్చి సాయం చేయాల‌ని ట్విట్ట‌ర్‌లో కోరారు.

Share