అంబ‌రీష్‌కు క‌న్నీటి వీడ్కోలు

ఏపీ టాప్ న్యూస్‌: ప్రముఖ సినీనటుడు, నటి సుమలత భర్త అంబరీష్‌(66) కన్ను మూసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోలో అంత‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. కంఠీర‌వ స్టూడియోకి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చారు. 80వ దశకంలో నటుడిగా ఓ వెలుగు వెలిగిన అంబరీష్‌కు రజనీకాంత్, చిరంజీవి, కమల్‌హసన్‌లు మంచి స్నేహితులు. అటు కన్నడ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్‌లోనూ ఎంతో మంది స్నేహితులను సంపాదించారాయన. సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే.

Share