విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌ప్పిన ప్ర‌మాదం

ఏపీ టాప్ న్యూస్‌: అర్జున్ రెడ్డి, గీతా గోవింధం సినిమాల విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్‌దేవ‌ర‌కొండ తాజాగా `డియ‌ర్ కామ్రేడ్‌`లో న‌డిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ రోజు కాకినాడ‌లోజ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక సీన్లో విజయ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి వేగంగా మెట్లు దిగి వచ్చి కదులుతున్న ట్రైన్‌లో ఎక్కాలి. అలా ఎక్కబోతూ విజయ్ పట్టుతప్పి పడిపోయాడు. సిబ్బంది వెంటనే తేరుకుని విజయ్‌ను పక్కకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తన ఎడమ చేతికి తగిలిన గాయాన్ని చూపిస్తూ ‘లైఫ్‌లో ఏదీ ఈజీగా రాదు’ అంటూ సోషల్ మీడియాలో విజయ్ పోస్ట్ పెట్టాడు. అయితే ‘పెథాయ్’ తుపాను కారణంగా ప్రస్తుతం ఈ చిత్రబృందం షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

Share