టీడీపీకి ఆమంచి రాజీనామా వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ

ఏపీ టాప్ న్యూస్‌: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. “చీరాల నియోజ‌క వ‌ర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల‌లో మ‌రియు ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌లో పార్టీ మ‌రియు ప్ర‌భుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని శ‌క్తుల ప్ర‌మేయాన్ని వ్య‌తిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను“ అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు త‌న రాజీనామా లేఖ‌ను పంపించారు. అనంత‌రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో లోట‌స్‌పాండ్‌లో భేటీ అయ్యారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో వ‌చ్చిన ఆమంచి వైయ‌స్ జ‌గ‌న్‌తో దాదాపు అర్ధ‌గంట‌కు పైగా భేటీ అయ్యారు. జ‌గ‌న్‌తో మాట్లాడి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమంచి వైసీపీ నాయ‌కులు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, సాయిరెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడారు.
చంద్ర‌బాబు నాయుడ‌కు పిచ్చిప‌ట్టి రోజుకో విధంగా మాట్లాడుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు ఇచ్చే హామీలు గాలిలో మేడ‌లుగా ఉన్నాయ‌న్నారు. గ‌డిచిన‌ నాలుగేళ్లుగా రూ.6400 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వలేదని, వడ్డీ రుణం మాఫీ చేస్తామని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేద‌న్నారు. పసుపు – కుంకుమ పేరును చంద్రబాబు చెడ‌గొట్టార‌న్నారు. పసుపు – కుంకుమను జారుడు బండపై పోశార‌ని, అది గాల్లోకి కలిసిపోతోంద‌న్నారు. ఇలాంటి దారుణమైన చర్యలు భరించలేకే తాను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు చెప్పారు.

Share