అమ్మ క‌న్నీళ్లు తుడిచిన జ‌గ‌న్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంతో జ‌గ‌న్ మాతృమూర్తి క‌న్నీళ్లు పెట్టుకుంది. అది గ‌మ‌నించిన జ‌గ‌న్ ఆమె క‌న్నీళ్లను తుడిచారు. ఆ ఫోటో ప్ర‌స్తుతం షోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. తన కుమారుడు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లో ఆయన తల్లి వైయ‌స్ విజయమ్మ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో జగన్ తల్లి విజయమ్మ కన్నీరు తుడిచారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఆ తర్వాత అనంతరం జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే జగన్ రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం పెడుతుండడాన్ని చూసి తల్లి విజయమ్మ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
జగన్ మాట్లాడుతున్నంతసేపు పట్టి ఉంచిన కన్నీటిని ఆపుకోలేక ఒక్కసారిగా జగన్‌‌ను హత్తుకుని ఏడ్చేశారు. అదేసమయంలో కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం కూడా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తుండగా, జగన్ తల్లి కన్నీళ్లను తుడిచి అతిథులను సాగనంపుదాం రామ్మా అంటూ తోడ్కొని వెళ్లారు. సభలో అప్పటివరకు కనిపించిన ఆవేశపూరిత వాతావరణంలో విజయమ్మ చూపించిన పుత్రవాత్సల్యం అందరి కళ్లను చెమర్చేలా చేసింది. అసలైన పుత్రోత్సాహం విజయమ్మతో కనిపించింది.

Share