మ‌ళ్లీ యూట‌ర్నా?

ఏపీ టాప్ న్యూస్‌: త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను తుంగ‌లో తొక్కి ప్ర‌తి విష‌యంలోనూ యూట‌ర్న్ తీసుకున్న సంగ‌తి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. రైతుల రుణ‌మాఫీ విష‌యంలో కానీ, డ్వాక్రా రుణాల మాఫీ విష‌యంలో కానీ.. నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగ విష‌యంలో కానీ.. మ‌రీ ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కానీ.. ఇలా ప్ర‌తి దానిలో చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. తాజాగా చంద్ర‌బాబు మ‌రో సారి యూట‌ర్న్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. మొన్నటివరకు బీజేపీని, నరేంద్రమోడీని తిట్టిపోసిన చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిరిగి బీజేపీతో కలిసిపోవాలని చూస్తున్నారట. నమ్మశక్యంగా అనిపించకపోయినా, చెప్పుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇది నిజం అంటున్నారు విశ్లేషకులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నిస్సిగ్గుగా బీజేపీతో చేతులు కలపడానికి బాబు సిద్ధమౌతున్నారట.ఈ మేరకు వెంకయ్యనాయును చంద్రబాబు రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. గతంలో బీజేపీ-టీడీపీ పొత్తులో కీలకపాత్ర పోషించారు వెంకయ్య. కానీ ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రెండుపార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
మరీ ముఖ్యంగా చంద్రబాబు ఏకపక్షంగా ఎన్డీఏ నుంచి వైదొలిగి, బీజేపీపై తిట్ల దండకం అందుకున్నారు. ఈ వ్యూహం తనను గెలిపిస్తుందని భావించారు. కానీ జనాలు బాబును చిత్తుగా ఓడించారు. దీంతో రాజకీయంగా ఏకాకి అయిన బాబు, మరోసారి వెంకయ్యను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కేశినేని నానితో రాయబారం పంపించి, బీజేపీతో సంప్రదింపులు జరపమని వెంకయ్యను కోరారట. అవినీతి చేసిన ఎవ్వర్నీ వదిలిపెట్టమని ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రకటించారు. తీగలాగితే డొంక కదిలినట్టు.. ఒక్కొక్క వ్యవహారం బయటకొచ్చేకొద్దీ తను బుక్ అవ్వడం ఖాయమనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఇలాంటి టైమ్ లో కేంద్రంతో కలిసిపోవడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ అతిపెద్ద యూటర్న్.

Share