జ‌గ‌న్ పాల‌న విజ‌య‌వంతం కావాలి

ఏపీ టాప్ న్యూస్‌: “ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌పై ప‌లు పార్టీల నాయ‌కులు, మీడియా ఛాన‌ళ్లు ప‌లు విధాలుగా విమ‌ర్శ‌లు చేశారు. వాళ్ల విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న విజ‌యం అందించారు. జ‌గ‌న్ పాల‌న విజ‌య‌వంతం కావాలి“ అని ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు. వైయస్ జగన్ పై రకరకాల ఆరోపణలు చేశారని వాటన్నింటిని ప్రజలు తిరస్కరించారని చెప్పుకొచ్చారు. కొన్ని మీడియా ఛానెల్స్ వైయస్ జగన్ పై దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైసీపీని పట్టాలెక్కిస్తాడా లేదా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని వాటిని ప్రజలు పటాపంచెలు చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పనికిరానివాడని, ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతారంటూ కొన్ని మీడియా ఛానెల్స్ పనిగట్టుకుని వక్రభాష్యాలు చెప్పిందని, జగన్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేడని సందేహాలు కలిగేలా ప్రచారం చేశారని మండిపడ్డారు.
జగన్ నాయకత్వంపై సందేహాలు వెలిబుచ్చుతూ, ఆ పార్టీ నేతలను గందరగోళం నెట్టే ప్రయత్నం పత్రికలు, ఛానెల్స్ చేశాయన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని రికార్డు సృష్టించారని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఏయే అమలుకు సాధ్యపడతాయో నిపుణులతో చర్చించి వాటిని అమలు చేయాలని సూచించారు.

Share