జ‌గ‌న్ బెస్ట్ సీఎం కావ‌డం ఖాయం

ఏపీ టాప్ న్యూస్‌: “ ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని ఎన్నిక‌ల ముందు… అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 6 నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ఇవ్వండి. త‌ప్ప‌కుండా బెస్ట్ సీఎం అని అనిపించుకుంటా“ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన విష‌యం తెలిసింది. ప్ర‌స్తుతం ఆయ‌న దూకుడు చూస్తుంటే బెస్ట్ సీఎం అనిపించుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎంతో స‌మ‌యం ప‌ట్టేట‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు…
మరో వైపు జగన్ ఘన విజయం జాతీయ రాజకీయాలను, పొరుగున ఉన్న తెలంగాణా రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. జగన్ సామాజికవర్గం తెలంగాణాలో బాగా ఎక్కువ. మరి సీఎం సీట్లో కుదురుకుని తెలంగాణాలో వైసీపీని బలోపేతం చేసే పనిలోకి జగన్ దిగుతాడన్న అనుమానాలు గులాబీ దండులో ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ స్పీడ్ పెంచుతున్న తీరు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా ఉంది. కేసీయార్, జగన్ ల మధ్య ఇప్పటికిపుడు పోలిక పెట్టడం సరి కాదు కానీ జగన్ జాగ్రత్తగా పాలన చేసుకుంటే కచ్చితంగా ఉమ్మడి ఏపీలోనే బెస్ట్ సీఎం అవుతారని మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు.

Share