ఏపీసీఎంకు స్వామినాథ‌న్ అభినంద‌న‌లు

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భార‌త‌ర‌త్న బిరుదాంకితుడు, ప్ర‌ఖ్యాత వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రైతుల‌కు రైతు భరోసా కింద 12500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం చేయాలన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ,రైతులకోసం కలిసి పనిచేశామని అన్నారు. జగన్ స్కీమ్ వల్ల రైతులలో మనో ధైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు. ‘మీ నాయకత్వంలో రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఎంఎస్‌ స్వామినాథన్‌ రాసిన లేఖలో తెలిపారు

Share