జ‌గ‌న్ పాల‌న అద్భుతం

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ పాల‌న అద్భుత‌మ‌ని చాలా మంది మేధావులు, ప్ర‌ముఖులు, రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మంచి ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకునేందుకు ఏడాది స‌మ‌యం అడిగిన వైయ‌స్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన 10 రోజుల్లోనే తెచ్చుకున్నార‌ని కితాబిస్తున్నారు. మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు, ప్ర‌జ‌లు మెచ్చుకోవ‌డం ఒక ఎత్తైతే.. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌లు సైతం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం మ‌రోఎత్తు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ త‌మ నాయ‌కుడు చాలా బాగా పాల‌న చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.
జగన్ పాలన చూసి ప్రజలు ఆశ్చ‌ర్య‌పోతున్నారంటున్నారు. దివంగత మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి పాలనను మరిపించేలా చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే జగన్‌ చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారని చెబుతున్నార‌న్నారు. చంద్రబాబులా జగన్‌కు ప్రజలను మోసం చేయడం తెలియదు….రాదు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే తన సమయాన్ని వినియోగించుకున్నారు. అదే జగన్ మంచి పాలనపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ప్రభుత్వ విప్‌గా తనకు బాద్యత ఇచ్చారని దానికి న్యాయం చేస్తానని ఆయన అన్నారు.

Share