…అను నేను!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా చిన అప్పలనాయుడు శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, తర్వాత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత వ‌రుస‌గా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అసెంబ్లీకి వచ్చే ముందు తన శాసనసభ్యులతో కలసి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుకు నివాళులర్పించారు. జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి నమస్కరించారు. తర్వాత సభలో ఉన్నవారందరికీ నవ్వుతూ నమస్కారం చేశారు. అనంతరం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత మంత్రులు వ‌రుస‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. త‌ద‌నంత‌రం ఎమ్మెల్యేలు అక్ష‌ర క్ర‌మంలో ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు.

Share