పార్టీని బాబు బలోపేతం చేయ‌గ‌ల‌రా?

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీని కాపాడ‌గ‌ల‌రా? పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌ల‌రా? అంటే క‌ష్ట‌మ‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వివ‌రాల్లోకి వెళ్లితే..ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన చంద్రబాబుకు ఇప్పట్లో కష్టాలు దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కేశినేని నాని లాంటి నాయకులు తల ఎగరేస్తున్నారు. నేరుగానే కౌంటర్ లు ఇస్తున్నారు. కష్టకాలం కావడంవల్ల చంద్రబాబు కూడా నోరు మెదపడం లేదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇలా ఉంటే.. అటు తెలంగాణలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అసలు పార్టీ అంటూ ఒకటి ఉందా అనే దుస్థితి. కనీసం ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయారు. అందుకే పార్టీలో అరకొరగా మిగిలిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ లంకాల దీపక్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. వెళుతూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. అసలు చంద్రబాబుకు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలన్న ఆలోచనే లేదని విమర్శించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశం నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని జోస్యం చెప్పారు. పాపం చంద్రబాబు మాత్రం ఏం చేస్తారు.. ఏపీ లోనే పార్టీని కాపాడుకునేందుకు ఆయన నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణ గురించి పట్టించుకునే తీరిక ఎక్కడిది ?

Share