జ‌గ‌న్ ముఖ్యఅతిథిగా వ‌స్తున్నారు

ఏపీ టాప్ న్యూస్‌: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కొలిక్కి వచ్చింది. ఇప్పటికే అనేక పనులను యుద్ధ ప్రాతిపదికన సాగిస్తున్నారు. కొన్ని పంపులను ట్రయల్ రన్ పూర్తి చేశారు కూడా. కేసీఆర్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వేల కోట్ల రూపాయలు ఉదారంగా కేటాయించింది. తెలంగాణ పాలిట‌ జీవనాడిగా కాళేశ్వ‌రంని భావిస్తున్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కాలేశ్వరం ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్‌ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను కేసీఆర్ ఆహ్వానిస్తారు. ఇప్పటికే కేసీఆర్‌ జగన్ చక్కటి సమన్వయంతో తెలుగు రాష్ట్రాలను ముందుకు నడిపిస్తున్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Share