బాబుపై ఫైర్ బ్రాండ్‌

ఏపీ టాప్ న్యూస్‌: అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన రెండ‌వ రోజే త‌న దైన శైలిలో ప్రతిపక్షంపై విరుచుకు పడ్డారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. తమ్మినేని సీతారాం స్పీకర్ కుర్చీని అలంకరించే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాకపోవడాన్ని రోజా తీవ్రంగా తప్పుబట్టారు. అనుభవం ఉన్న నేత హుందా తనంతో వచ్చి స్పీకర్‌ని కూర్చోబెట్టవచ్చు కదా! అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు రోజా. “మంచిచెడుల గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణగా గతాన్ని తీసుకుంటాం. వైసీపీ నేతల మాటలపై టీడీపీ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. స్పీకర్‌ని అవమానించడం స్పీకర్ పదవిని దుర్వినియోగం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తమ్మినేని సీతారాం స్పీకర్ అయినందుకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసులు సంతోషపడాలి. కానీ అచ్చెన్నాయుడికి సంతోషం కంటే కడుపు మంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చెవి రెడ్డి మాటలపై రాద్ధాంతం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలకు ఎన్ని రోజులు గుంజీళ్ళు తీసి, లెంపకాయలు వేసుకున్నా సరిపోదు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి ఘనంగా జరుపుతారు. కానీ ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకొని అసెంబ్లీలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. యనమల రామృష్ణుడిని ఉపయోగించి సభాపతి స్థానాన్ని ఎలా? దుర్వినియోగం చేశారో? అందరికీ తెలుసు.
గత అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ గురించి నేను మాట్లాడితే రూల్స్‌కు విరుద్థంగా ఏడాది సస్పెండ్ చేశారు. కోర్టు తీర్పును కూడా గౌరవించకుడా నన్ను లోపలికి రానీయకుండా మార్షల్స్‌తో బయటకు నెట్టేశారు. మీరా సభా సంప్రదాయాల గురించి మాట్లాడేది” అంటూ విరుకుప‌డ్డారు. సభాపతి స్థానం తండ్రి లాంటిదని అన్నారు రోజా. తండ్రి అందరినీ సమానంగా చూస్తారని, సభలో సభ్యులందరినీ స్పీకర్ సమానంగా చూడాలని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం అందరికీ అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నట్లు రోజా తెలిపారు.

Share