జ‌గ‌న్ జోరు చూసి…

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులే అయింది. పైగా కేబినెట్‌ను ఏర్పాటు చేసుకుని మూడు రోజులు మాత్రమే అయింది. ఈ అత్యంత స్వల్ప స‌మ‌యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్నయాలే, వేస్తున్న అడుగులు ఇప్పుడు విప‌క్షంలో కూర్చున్న చంద్రబాబు అండ్ త‌మ్ముళ్లకు నిద్రప‌ట్టనివ్వడంలేదు. నిర్ణయాల్లో ఎక్కడా తాత్సారం లేకుండా, ఎక్కడా త‌డ‌బాటు ప‌డ‌కుండానే జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తున్నారు. మంత్రి వ‌ర్గ కూర్పు నుంచే త‌నేంటో చూపించిన జ‌గ‌న్‌.. పాల‌న ప‌రంగా వేస్తున్న అడుగులు ప్రజ‌ల్లో చ‌ర్చకు వ‌స్తున్నాయి. ముఖ్యంగా అవ్వతాతల పింఛ‌న్‌ను రూ.2250కి పెంచ‌డం, ఆశావ‌ర్కర్ల వేత‌నాల‌ను రూ.10వేల‌కు పెంచ‌డం వంటి సంచ‌ల‌న నిర్ణయాలు ఆయ‌న రేంజ్‌ను అమాంతం పెంచాయి. ఇక‌, తాజాగా ఆర్టీసీ విలీనం ప్రతిపాద‌న‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇది ఓకే అయితే, ఇక‌, రాష్ట్రంలో జ‌గ‌న్ కు తిరుగు ఉండ‌ద ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న సీపీఎస్ ర‌ద్దు దిశ‌గా కూడా జ‌గ‌న్ అడుగులు వేస్తు న్నారు. ఇది కేంద్రానికి సంబంధించేదే అయినా.. జ‌గ‌న్ త‌న నిర్ణయంతో ఉద్యోగుల స‌మ‌స్య ప‌రిష్కరించేందుకు రెడీ అయ్యారు. ఇది కూడా జ‌గ‌న్‌కు మెజారిటీ ప్లస్‌గా మారుతుంది.
గ్రామాల్లో 4 ల‌క్షల మంది వాలంటీర్ల నియామ‌కం, గ్రామ స‌చివాలయాల్లో 1.6 ల‌క్షల మంది ఉద్యోగుల నియామ‌కం వంటి వాటికి కూడా జ‌గ‌న్ తెర‌దీశారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న చంద్రబాబు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో ఇలాంటి నిర్ణయాలు, నియామ‌కాలు మ‌నం ఎప్పుడైనా చేశామా? అని రికార్డులు ప‌రిశీలించుకుంటున్నార‌ట‌. ఇక‌, జ‌గ‌న్ దూకుడు గ‌మ‌నించిన నాయ‌కులు ఐదేళ్లు కాదు.. మ‌నం ప‌దేళ్లు ప్రతిప‌క్షంలోనే ఉండాల్సి ఉంటుంద‌ని లెక్కలు వేసుకుంటున్నార‌ట‌.

Share