జ‌గ‌న్ గ్రేట‌బ్బా!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న‌ నిర్ణయాలు రాజకీయ పండితులతో శభాష్ అనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ఎంత మాత్రము ప్రోత్సహించేది లేదని తెగేసి చెప్పడం అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. అంతేకాదు ఎవ‌రినోట విన్నా జ‌గ‌న్ గ్రేట‌బ్బా అనే మాట‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఐదు మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాగేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిసినా… ఎంత మాత్రము అలాంటి సిగ్గుమాలిన పని చేయ బోమని జగన్ అసెంబ్లీ లో కుండబద్దలు కొట్టి చెప్పారు. ఫిరాయింపు రాజకీయాలపై జగన్ వైఖరి రాష్ట్రాలకు అతీతంగా చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి తెలంగాణలో జగన్ వైఖరి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వయసులో చిన్నవారైన జగన్ను చూసి కేసీఆర్‌ బుద్ధి తెచ్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయశాంతి వంటివారు జగన్ మాటలు కోట్ చేస్తూ కేసీఆర్‌ పై విరుచుకుపడుతున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు జగన్ వైఖరిని మెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లో విలువలు రోజుకి దిగజారిపోతున్న తరుణంలో ఫిరాయింపు రాజకీయాలపై జగన్ స్టాండ్ ఓ బెంచ్ మార్కులా మిగిలిపోనుంది. అన్ని విషయాల్లోనూ జగన్ ఇలా కొత్త ట్రెండ్ సృష్టించాలని వైసీపీ నేత‌లు కోరుతున్నారు.

Share