సంక్షేమ పాల‌న దిశ‌గా ఏపీ స‌ర్కార్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనపై తనదైన మార్క్ చూపిస్తున్నా ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. కీల‌క నిర్ణ‌యాలుతీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ (ఏపీ – సామ్)ను వైఎస్ఆర్సీపీ సర్కారు ఏర్పాటు చేసింది. వ్యవసాయం రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఉత్పత్తిని పెంచి, సాగును లాభసాటిగా మార్చడం.. పంటకు గిట్టుబాట ధర కల్పించే దిశగా ఈ మిషన్ కసరత్తు చేయనుంది. ‘రైతు భరోసా’ కింద ఏటా రూ.12,500 చొప్పున ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం చేస్తామని ఇప్పటికే వైయ‌స్ఆర్‌సీపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో సోలార్, విండ్ పవర్‌లను అధిక ధరలకు కొనుగోలు చేయడంతో… విద్యుత్ కొనుగోళ్లల భారీగా అవకతవలు జరిగాయని వైయ‌స్ఆర్‌సీపీ సర్కారు అనుమానిస్తోంది.
ఈ ఒప్పందాలను సమీక్షించడం కోసం.. గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కన్వీనర్‌గా ట్రాన్స్‌కో సీఎండీ వ్యవహరించనుండగా.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని సహా 9 మంది సభ్యులుగా ఉండనున్నారు. డిస్కంలకు తక్కువ ధరలకు విద్యుత్ విక్రయించే వారితో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. 45 రోజుల్లో ఈ కమిటీ సర్కారుకి నివేదిక అందించనుంది.

Share