పార్టీలే వేరు.. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌

ఏపీ టాప్ న్యూస్‌: అధికార పార్టీల్లోకి ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు జంప్ కావ‌డం స‌హ‌జ‌మే. పార్టీలు మారిన‌ప్పుడు వాళ్లు చెప్పే డైలాగులు తెలిసిన‌వే. అయితే మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అందుకు అతీతుడేమీ కాదు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అప్ప‌టి అధికార పార్టీలోకి వెళ్లి తెలుగుదేశం పార్టీలో మంత్రి ప‌ద‌వి అనుభ‌వించారు. కాగా నాలుగు నెల‌ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ నుంచి జంప్ అవుతార‌ని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ ఆది నారాయ‌ణ‌రెడ్డి స్వ‌యంగా తాను పార్టీ మార‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బీజేపీలో చేరుతున్న‌ట్లు కూడా చెప్పారు. అయితే ఆయ‌న పార్టీ మార‌డంపై ఏపీ ప్ర‌జ‌లు మాత్రం నాడు వైసీపీ నుంచి టీడీపీలోకి నేడు టీడీపీ లోనుంచి బీజేపీలోకి వెళ్ల‌డంపై ఏపీ ప్ర‌జ‌లు “పార్టీలే వేరు.. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌“ అంటూ ఆదినారాయ‌ణ‌రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఆదినారాయ‌ణ‌రెడ్డి కావాల‌నే బీజేపీలో చేరాడా? చ‌ంద్ర‌బాబు నాయుడు పంపించారా? అన్న అనుమానం కూడా ప్ర‌జ‌ల్లో ఉంది.

Share