కాంగ్రెస్‌లోకి బండ్ల గ‌ణేష్‌

ఏపీ టాప్ న్యూస్‌: ప‌్ర‌ముఖ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద‌యం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంత‌రం బండ్ల గ‌ణేష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చేరాల‌న్న త‌న కోరిక నెర‌వేరింద‌న్నారు. పార్టీలో చేరడానికి త‌న‌కు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన‌న్నారు. కానీ టికెట్ ఎక్కడ ఇస్తారు? మహాకూటమి ఈక్వేషన్లు, ఇతరత్రా వ్యవహారాలు అన్నవి త‌న‌కు తెలియ‌వ‌ని, త‌న‌కు రాహుల్ ఎలాంటి క‌మిట్మెంట్‌లు ఇవ్వ‌లేద‌ని, తాను సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాన‌న్నారు. అయితే జూబ్లీహిల్స్ నుంచి బండ్ల పోటీ చేయాల‌ని అనుకుంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీలోని కొంత‌మంది నాయ‌కులు అంటున్నారు. బండ్ల గ‌ణేష్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share