ఏపీలో జ‌గ‌న్‌.. తెలంగాణ‌లో కేసీఆర్‌

ఏపీ టాప్ న్యూస్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారి మార్పిడి త‌ప్ప‌దా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ గెలుపు ఖాయ‌మా?  తెలంగాణలో ప‌రిస్థితి కేసీఆర్‌కే సానుకూలంగా ఉందా? మ‌ళ్లీ కేసీఆర్ ముఖ్య‌మంత్రి అవుతాడా? అంటే అవున‌నే అంటోంది`ఇండ‌యా టుడేయాక్సిస్ మై ఇండియా` స‌ర్వే. వివ‌రాల్లోకి వెళ్లితే.. సెప్టెంబ‌ర్ 8 నుంచి 12వ తేదీ వ‌ర‌కు దాదాపు 10,650 మంది నుంచి స‌మాచారం సేక‌రించామ‌ని ఈ స‌ర్వేలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ పాల‌న‌పై తీవ్రఅసంతృప్తితో ఉన్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని స‌ర్వే చెబుతోంది.   సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది , చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌కళ్యాణ్‌కు5% మ‌ద్ద‌తుఇచ్చారు. దీన్ని బ‌ట్టి  చూస్తే త్వ‌ర‌లో జ‌రగ‌బోయే ఎన్నిక‌ల్లో  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతార‌ని అని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని పేర్కొంది. ఏపీలో ప‌రిస్థితి ఇలా ఉంటే తెలంగాణ‌లో మాత్రం వేరేలా ఉంది. అక్క‌డ అధికారపార్టీవైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌ట‌.

ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి దాదాపు 9 నెల‌ల ముందే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీఆర్ఎస్ అధ్య‌క్షుడు కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుకు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని స‌ర్వే సారాంశం. కేసీఆర్‌కు 43 శాతం మంది, ఉత్త‌మ్కుమార్ రెడ్డికి 18 శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో కేసీఆర్ తెలంగాణ‌లో ఎవ‌రికీ అంద‌నంత దూరంలో దూసుకుపోతున్నాడు. కాగా ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతారాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని వెల్లడైంది.

Share