నాలుగున్న‌రేళ్ల‌లో చంద్ర‌బాబు సాధించింది ‘జీరో’

ఏపీ టాప్ న్యూస్‌: గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో చంద్ర‌బాబు సాధించింది జీరో అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. భార‌త‌దేశ‌పు ప్ర‌ముఖ ఇంజ‌నీరు, భార‌త‌ర‌త్న మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు పాద‌యాత్ర శిబిరం వ‌ద్ద ఇంజ‌నీర్స్‌డే వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ చంద్ర‌బాబు రాష్ట్రంలో ఉన్న ఇంజ‌నీర్ల‌ను మ‌రిచిపోయాడ‌న్నారు. మ‌న‌వాళ్లు మురికివాడ‌లు మాత్ర‌మే క‌డ‌తారంటూ అవ‌హేళ‌న చేస్తున్నార‌న్నారు. రాజ‌ధాని డిజైన్ పేరుతో చంద్ర‌బాబు విదేశాలు చుట్టివ‌స్తున్నారు త‌ప్పితే మ‌న ఇంజ‌నీర్ల‌తో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు.
మన ఇంజనీర్లు ఏనాడో తమ ప్రతిభను చాటుకున్నాన‌పి. అప్పటి ఉమ్మడి రాజధాని, ఇప్పటి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు కట్టడాలను వైయ‌స్ జ‌గ‌న్ ఉదహరించారు. కేంద్రం 2016లో రూపొందించిన దివ్యాంగుల చట్టం ప్రకారం ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని అమలు చేయడంలేద‌ని మండిప‌డ్డారు. కాగా చాలా మంది ఇంజనీర్లు యూనిఫాంతో హాజ‌రు కావ‌డం విశేషం.

Share