‘నేనే ప్ర‌ణ‌య్‌ను హ‌త్య చేయించా’

ఏపీ టాప్ న్యూస్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ హత్యకు సంబంధించి పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం… ప్ర‌ణయ్‌ని హ‌త్య చేయించింది తానే న‌ని అమృత తండ్రి మారుతీరావు చెప్పార‌ని పోలీసులు చెబుతున్నారు. త‌న కూతురు అమృత త‌మ‌కు ఇష్టం లేద‌ని చెప్పినా వేరే సామాజిక వ‌ర్గానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంద‌ని, అందుకే ఓ కిరాయి హంత‌కుడికి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి హ‌త్య చేయించిన‌ట్లు ఒప్పుకున్నార‌ని అంటున్నారు. అయితే మారుతీరావును, ఆత‌ని తమ్ముడిని పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ కిరాయి హంతకుడి ఆచూకీ కోసం గాలిస్తున్న‌ట్లు చెప్పారు. మరోవైపు – ప్రణయ్ హత్య నేపథ్యంలో ఈ రోజు దళిత సంఘాలు మిర్యాలగూడలో బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Share