బాబు మ‌ళ్లీ పాత‌పాటే

ఏపీ టాప్ న్యూస్‌: ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు నాయుడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే రాష్ట్రాన్ని విడ‌గొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన‌ట్లేన‌ని అన్నారు. బీజేపీ మాత్ర‌మే రాష్ట్రానికి న్యాయం చేస్తుంద‌న్నారు. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు బీజేపీని విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లిపేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే. ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు పాత‌పాటే పాడుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసిన‌ట్లేన‌ని అన్న చంద్ర‌బాబు ఇప్పుడు జ‌గ‌న్‌కు ఓటువేస్తే బీజేపీకి ఓటువేసిన‌ట్లేన‌ని అంటున్నారు. జ‌గ‌న్‌కు బీజేపీకి మ‌ధ్య ర‌హ‌స్య అనుబంధం ఉంద‌ని కూడా ఆరోపిస్తున్నారు. తాను రాష్ట్రం కోసం పోరాడుతుంటే త‌న‌పై బీజేపీ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని చెబుతూ దానిని కూడా జ‌గ‌న్‌కు ముడిపెడుతున్నారు. అప్పుడెప్పుడో జ‌రిగిన‌దానికి, ఇప్పుడు జ‌గ‌న్ బీజేపీతో క‌లుస్తున్నాడ‌న‌డానికి ఏమిటి సంబంధం? బాబు వారెంట్ల‌కు జ‌గ‌న్‌కు ఏంటి సంబందం? ఈ మాత్రం కూడా బాబుకు తెలియ‌దా? లేక తాను ఏది చెబితే అది ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని భ్ర‌మ‌లో ఉన్నారా? ఏది ఏమైనా ప్ర‌జ‌లు చాలా తెలివైన వారు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తీర్పు క‌చ్చితంగా ఇస్తారు.

Share