బాబుపై బాల్క‌సుమ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు నాయుడు కేసులు, నోటీసులు అంటూ దొంగ డ్రామాలు మొద‌లు పెట్టార‌న్నారు. తెలంగాణ‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర‌లు ప‌న్నార‌ని విమ‌ర్శించారు. దొంగ‌ల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణ‌కు పంపించార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బాబు పంపిన దొంగ‌ల ముఠా తెలంగాణ‌లో జ‌రుగుతున్న స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తోంద‌న్నారు. అంతేకాదు ఏపీ నిఘా అధికారులు తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఏమోచ్చింద‌ని బాల్క సుమ‌న్ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు సంపాదించిన ల‌క్ష‌ల కోట్ల అవినీతి సొమ్మును తెలంగాణ‌లో ఖ‌ర్చు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఏపీ నుంచి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌న్నారు. కాగా ఏపీ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి గ‌వ‌ర్న‌ర్‌, డీజీపీల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని సుమ‌న్ పేర్కొన్నారు.

Share