ఎంత మాట‌..ఎంత మాట‌!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిపై గ‌త కొన్నినెల‌లుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన ఈ నాలుగున్న‌రేళ్లుగా నాలుగు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అవినీతి సొమ్మును సంపాదించార‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ఇద్ద‌రూ కూడా దేశం వ‌దిలిపెట్టి పోతార‌ని, అందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా చంద్ర‌బాబుది, లోకేష్ ఇద్ద‌రిదీ పాస్ పోర్టుల‌ను సీజ్ చేయాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు విశాఖలో భూదందాలు మొదలుకొని పోలవరం టెండర్ల వరకు టీడీపీ నేతలంతా అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్నారని, టీడీపీ ప్రభుత్వ పాలనలో అక్రమాలు – అన్యాయాలు – భూదందాలు – అక్రమ మైనింగ్ పెరిగిపోయాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాబు అవినీతి పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తేనే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.

Share