తెలంగాణ‌లో టీడీపీ పోటీ వెనుక‌ చంద్ర‌బాబు వ్యూహం ఏంటో తెలుసా?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏది చేసినా ప‌క్కా ప్లాన్‌తో చేస్తాడా? ఆయ‌న భ‌విష్య‌త్‌ను ముందే ఊహించి నిర్ణ‌యాలు తీసుకుంటుంటాడా?  తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవ‌డం.. పెద్ద‌గా బ‌లం లేక‌పోయినా తెలంగాణ‌లో పోటీ చేయ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే దాగుందా? అంటే అవున‌నే అంటున్నారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి. అంతేకాదు చంద్ర‌బాబు భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోందో ఆయ‌న ముందుగానే ఊహించినందుకు మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. చంద్ర‌బాబును నాయిని ఎందుకంత‌లా మెచ్చుకుంటున్నార‌నేది తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. 2019లో జ‌రిగిలే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఏపీలో ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని, అక్క‌డ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు నాయిని న‌ర్సింహారెడ్డి. ఈ విష‌యం తెలిసే చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తెలంగాణ‌లో త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను పోటీ చేస్తున్నార‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు ఓడిపోవ‌డానికి.. తెలంగాణ‌లో టీడీపీ అభ్య‌ర్థులను పోటీ చేయించడానికి కార‌ణం ఏంట‌నేగా మీ అనుమానం.. దానికి  కూడా నాయిని క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న వ‌చ్చేది హైద‌రాబాద్‌కే న‌ని, అందులో తెలంగాణ‌లో  టీడీపీ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఉంటే తాను హైదరాబాద్ లో కాపురం ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు అవకాశం ఉంటుందనే ఆలోచ‌న‌తో బాబు ఇక్క‌డ అభ్య‌ర్థుల‌ను నిలుపుతున్నార‌ని  చెప్పుకొచ్చారు. కాగా వ‌చ్చే ఎన్నికల్లో వైయ‌స్ జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని ఇటు ఏపీ నాయ‌కులు.. అటు తెలంగాణ నాయ‌కులు చెబుతుండ‌డంతో చంద్ర‌బాబు నాయుడికి చిర్రెత్తుకొస్తోంద‌ట‌. 40 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాలు ప‌న్నుతాడో చూడాలి మ‌రి.

Share