జ‌న‌సేనాని ప్ర‌సంగం గ‌జిబిజి గంద‌ర‌గోళం

ఏపీ టాప్ న్యూస్‌: జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త కొన్ని రోజులు ఉత్త‌రాంధ్ర‌జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్నప్ర‌సంగాలు ఎవ‌రికీ ఒక ప‌ట్టాన అర్థం కావ‌డం లేదు. క్లారిటీ లేకుండా ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌సంగాల‌తో సామాన్య ప్ర‌జ‌లే కాదు.. జ‌న‌సేన అభిమానులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. టీడీపీని విమ‌ర్శిస్తున్నారో అర్థం కాదు..పొగుడుతున్నారో అర్థం కాదు, బీజేపీ తిడుతున్నారో అర్థం కాదు..మెచ్చుకుటున్నారో అర్థం కాదు.. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ద్ద‌తు ఇస్తున్నారో అర్థం కాదు.. మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదో అర్థం కాదు. చంద్ర‌బాబుకు చాలా అనుభ‌వం ఉంది..ఆయ‌న అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడ‌ని న‌మ్మి బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని అంటాడు. మ‌ళ్లీ  ఆయ‌నే  చంద్ర‌బాబు రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా మార్చార‌ని, ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నార‌ని, పేద‌ల పొట్ట కొట్టార‌ని అంటారు. బీజేపీ అయితేనే ప్ర‌జ‌లకు మంచి చేస్తుంద‌ని చెప్పిన ప‌వ‌నే నేడు బీజేపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిందంటున్నారు. అందుకే  మోడీతో, అమిత్‌షాతో కొట్లాడుతున్నాన‌ని అంటున్నారు.

వైసీపీకి ప్ర‌జ‌ల్లో బ‌లం లేద‌ని అంటున్న ప‌వ‌నే తాను బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయి ఉంటే జ‌గ‌నే సీఎం అయ్యేవార‌ని అంటారు. తాను ప్ర‌శ్నించ‌డానికి మాత్ర‌మే పార్టీ పెట్టాన‌ని, ప‌ద‌వుల‌పై ఆశ‌లేద‌ని చెబుతున్న జ‌న‌సేనాని త‌న‌కు ముఖ్య‌మంత్రిని కావాల‌ని ఉంద‌ని అంటున్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే మ‌రోప‌క్క నాయ‌కుల‌ నాలుక‌లు కోస్తానంటాడు.. క‌త్తిప‌డ‌తానంటాడు.. యుద్ధం చేస్తానంటాడు.. ఆవేశంగా మాట్లాడ‌తారు.. ఆనుమానంగా మాట్లాడ‌తారు..న‌వ్వుతూ మాట్లాడ‌తారు.. మౌనంగా ఉండిపోతారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అస‌లు ఎప్పుడు ఎలా మాట్లాడ‌తారో అంతుప‌ట్ట‌క జ‌న‌సేన అభిమానులు మౌనంగా ఉండిపోతున్నారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ‌ల‌ను కూడా సినిమాలు మాదిరిగానే చూస్తున్నార‌ని, ముందు రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న పెంచుకుని త‌ర్వాత బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తే బాగుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్నారు.

Share