`టిట్లీ` బీభ‌త్సం..8 మంది మృతి

ఏపీ టాప్ న్యూస్‌: శ్రీ‌కాకుళంజిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలో టిట్లీ తుపాను తీరాన్ని దాటింది. తుపాను తీరం దాటిన ప్రాంతాల్లో విస్తారంగా వ‌ర్షాలు ప‌డ్డాయి. తుఫాను ప్రభావం వల్ల గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.  పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విజయనగరం జిల్లా ముక్కాం గ్రామం వద్ద సముద్రం 150 అడుగుల దూరం వచ్చింది. తుపాను ధాటికి 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఓని అగ్రహారంలో చెట్టు విరిగిపడి నరసమ్మ (62), సరబుజ్జలి మండలంలో సూర్యారావు(55) అనే కూలీ చనిపోయారు. తిత్లీ తుపాను తీరం దాటటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

కాగా జిల్లా వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్‌లో కమాండింగ్‌ కమ్యునికేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 180042500002ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు.కవిటి మండలంలో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రజలను తరలిస్తున్నారు. కళింగపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలిలో మత్స్యకారులు పడవలు, వలలను ఒడ్డుకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలిలో ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు.

Share