30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నేనూ..బాబాయ్‌

ఏపీ టాప్ న్యూస్‌: విశ్వవిఖ్యాత నట సార్యభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ‘ఎన్టీఆర్’. నందమూరి బాలయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో ఇంట్రస్టింగ్ స్టిల్ బయటకొచ్చింది. అన్న ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో రథసారధిగా.. చైతన్య రథాన్ని నడిపిన హరికృష్ణ పాత్రకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ సినిమాలో రథసారధి పాత్రను నందమూరి కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. తన ట్వీట్‌లో ‘ 30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. బాబాయ్ వాళ్ల నాన్న గారిలా… నేను మా నాన్నగారిలా’ అంటూ ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫోటోలో ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలయ్య.. హరికృష్ణ పాత్రలో ఉన్న కళ్యాణ్ రామ్‌ భుజంపై చేయి వేస్తూ కనిపించారు. ఎదురుగా చైతన్య రథం కూడా ఉంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ ’ సెట్స్‌లో జాయిన్ అయినట్లు కల్యాణ్ రామ్ ఈ ట్వీట్ చేశారు. ఈ స్టిల్‌తో సినిమాలోని మరో ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. ఈ స్టిల్‌ చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. బాబాయ్-అబ్బాయ్ కాంబో అదుర్స్ అంటున్నారు. ఈ ఫోటోతో సినిమాకు మరింత హైప్ వచ్చిందంటున్నారు.

Share