అమ్మో..అమ్మో..అమ్మో చంద్ర‌బాబుకు ఎన్ని అవార్డులు

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి అవార్డుల పంట పండింది. అన్ని అవార్డులు ఆయ‌నే ఇచ్చేశారు. అవార్డులంటే నంది అవార్డులో.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులో అనుకునేరు. అవి ఆశామాషీ అవార్డులు కాదు.. గ‌తంలో ఎవ‌రికీ ఇచ్చి ఉండ‌రు కూడా. ఆ అవార్డులు ఏంటో తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే…ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి `గ్లోబ‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ లీడ‌ర్ షిప్ అవార్డు` వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే  దీనిపై తీవ్ర స్థాయిలు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌కూడా చంద్ర‌బాబుకు ఆ అవార్డు ఇవ్వ‌డంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గ‌జ‌ప‌తిన‌గ‌రంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. `గత వారం రోజులుగా మున్సిపాలిటీల్లో చెత్త పేరుకు పోయి, విష జ్వరాలు వ్యాపిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడికి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అవార్డు ఇవ్వాలి` అని అన్నారు.ఆయన చెత్త పాలనకు ఆ అవార్డే సరైందని వైయ‌స్ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. అంతేకాదు వ్యవసాయం దండుగ, ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని రైతన్నను అవమానించిన చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం రావడం హాస్యాస్పదంగా ఉందని జగన్‌ వ్యాఖ్యానించారు.

బాబుకు ఈ అవార్డు రావడం చూస్తుంటే రోజూ తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాదు బాబుకు వైయ‌స్ జ‌గ‌న్ అవార్డుల మీద అవార్డులు ఇచ్చారు.  “బాబు అధికారంలోకి వస్తే కరువు కూడా వస్తుందని అందుకే ఆయనకు ఉత్తమ కరువు రత్న అవార్డు, చెత్తగా పాలిస్తున్నందుకు చెత్త సీఎం అవార్డు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిద్ర పోతున్నందుకు కలియుగ కుంభకర్ణ అవార్డు“లు  ఇవ్వాలన్నారు. కరువును జయించానని బొంకుతున్న బాబు అధికారంలోకి రాగానే సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని, పంట దిగుబడి కూడా తగ్గిందని జగన్‌ విమర్శించారు. అయితే చంద్ర‌బాబు నాయుడు ఏ పార్టీతో క‌లిసి ఉన్నా ఆయ‌న మా శాశ్వ‌త మిత్రుడేన‌ని చెప్పిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా చంద్ర‌బాబు నాయుడికి గ్లోబ‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ లీడ‌ర్‌షిప్ అవార్డును ప్ర‌ధానం చేయ‌డం మ‌రింత విడ్డూరంగా ఉంద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Share