బాబూ..ఇప్పుడు ఎవ‌రి తాట తీయాలి?

ఏపీ టాప్ న్యూస్‌: జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త కొంత‌కాలంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడికి చాలా అనుభ‌వం ఉంద‌ని, ఆయ‌న అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తార‌ని న‌మ్మి మ‌ద్ద‌తు ఇస్తే రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొవ్వూరు బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబుపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒంటికాలిపై లేచ్చారు.  `బెల్టు షాపులు ర‌ద్దు చేయాల‌ని.. లేక‌పోతే తాట తీస్తాన‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబే ఇప్పుడు బెల్టు షాపులు పెరిగిపోతున్నా చ‌ర్య‌లు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఇప్పుడు ఎవ‌రి తాట తీయాలి చంద్ర‌బాబూ?“ అంటూ ఏపీ సీఎంను జ‌న‌సేనాని ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల రక్తాన్ని తాగేసి.. 20 శాతం ఆదాయం పెరిగిందని ప్రభుత్వం సంతోషపడ‌డం సిగ్గుచేట‌ని దుయ్య‌బ‌ట్టారు. ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత రైతులకు బకాయిలు కూడా చెల్లించాలన్న ఇంగితం ప్రభుత్వానికి లేకుండా పోయిందని.. ఇలాంటి విషయాలే ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని పవన్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకి సైతం తూట్లు పొడుస్తూ.. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలు పెట్టుకొనేలా ప్రత్యేక జీవోలు తీసుకురావడానికి ప్రభుత్వం సంకల్పిస్తోందని పవన్ అన్నారు.

ప‌నిలో ప‌నిగా స్థానిక మంత్రిని కూడా తూర్పార ప‌ట్టారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మంత్రి జవహర్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీరులో ఆల్కహాల్ శాతం తక్కువని.. ఆ బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయన చెబుతున్నారని.. ఇదేమి బోధన అని పవన్ ప్రశ్నించారు. తనను సైతం అనేక బీర్ తయారీ చేసే సంస్థలు గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగాయని.. కాకపోతే తాను తిరస్కరించానని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

Share