ఐటి దాడులు త‌ప్పా బాబుగారూ!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్న మాట‌లు వింటుంటే ఓ సీనియ‌ర్ నాయ‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా ఉంటూ అలా మాట్లాడ‌వ‌చ్చా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ఇళ్లు, ఆఫీస్‌ల‌పై జ‌రుగుతున్న ఐటి దాడులపై చంద్ర‌బాబు స్పందిస్తూ .. హ‌క్కుల కోసం డిమాండ్ చేస్తే ఐటి దాడులు చేయిస్తున్నార‌ని అన్నారు. అంతేకాదు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని, ఐటీ దాడులతో భయాన వాతావరణం సృష్టించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదన్నారు. న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు చంద్ర‌బాబు నాయుడు సూచించారు కూడా. అయితే బాబు మాట‌లు విన్న రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ నాయ‌కులు అవాక్క‌య్యారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉంటూ ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.
మామూలుగా ఐటి అధికారులు ఎప్పుడు దాడి చేస్తారో కూడా ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు తెలియ‌దా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఐటి దాడులుకు రాజ‌కీయ రంగు పుల‌మ‌డ‌మేంటి అని అంటున్నారు. ల‌క్ష‌ల కోట్లు అవినీతి సొమ్మును సంపాదించుకున్న వాళ్ల‌పై ఐటి దాడులు చేస్తే అది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధ‌మా? ఈ మాత్రం కూడా బాబుకు తెలియ‌దా? అంటూ నిల‌దీస్తున్నారు. ఏది ఏమైనా చంద్ర‌బాబు మాత్రం ఐటి దాడుల‌ను స్వాగ‌తించాల్సింది పోయి ఖండించ‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Share