ప‌వ‌న్ మ‌న‌సులో మాట !

ఏపీ టాప్ న్యూస్ : “జ‌న‌సేన పార్టీ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటుంది. ప్ర‌జ‌లకు అండ‌గా నిలుస్తుంది. ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగితే వారి త‌ర‌పున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తుంది. జ‌న‌సేన పార్టీ ప్ర‌శ్నించ‌డానికే పుట్టింది.“ అని పార్టీ స్థాపించిన కొత్త‌లో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. అంతేకాదు “నాకు ఎలాంటి ప‌ద‌వీకాంక్ష లేదు. నాకు ఎమ్మెల్యేని కావాల‌ని, మంత్రిని కావాల‌ని, ముఖ్య‌మంత్రిని కావాల‌ని కోరిక నాకు లేదు.“ అని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. రోజులు గ‌డిచే కొద్దీ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు మారుస్తూ వ‌స్తున్నాడు.
2014 ఎన్నిక‌ల ముందు టీడీపీ, బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపిన ప‌వ‌న్ ఇప్పుడు ఆ పార్టీల‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాన‌ని కూడా చెప్పారు. అంతేకాదు త‌న మ‌న‌సులోని మాట‌ను కూడా బ‌య‌ట‌కు చెప్పేశారు. 2019 లో ప్రజల ప్రేమాభిమానాలు ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని నరసాపురం సభలో అన్నారు. ఏది ఏమైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న మ‌న‌సులో మాట చెప్ప‌డం విశేషం.

Share