వైయ‌స్ఆర్‌సీపీలోకి డీఎల్‌

ఏపీ టాప్ న్యూస్ : మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? 2019 ఎన్నిక‌ల్లో మైదుకూరు నుంచి పోటీ చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. డీఎల్ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌తో ఇప్ప‌టికే ట‌చ్‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లో ఆయ‌న వైయ‌స్ జ‌గ‌న్‌తో మాట్లాడి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని అంటున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నుంచి బ‌రిలోకి దిగుతున్న ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను ఎదుర్కోవాలంటే డీఎల్ క‌రెక్ట్ అని స్థానిక ప్ర‌జ‌లు అంటున్న‌ట్లు వారు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టికే ఎమ్మెల్యేగా ఉన్న ర‌ఘురామిరెడ్డిని ఎమ్మెల్సీగా పంపించేందుకు జ‌గ‌న్ ఒప్పుకున్నార‌ని కూడా టాక్‌. డీఎల్ వ‌చ్చాక మైదుకూరులో రాజ‌కీయాలు మార‌తాయ‌న‌డంమాత్రం ఖాయం.

Share