హాలోవెన్ పార్టీలో మెగా ఫ్యామిలీ

ఏపీ టాప్ న్యూస్‌: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ స‌భ్యులంద‌రూ దెయ్యాలుగా మారిపోయారు. ఇంటికి వెళ్లిన వారంద‌రినీ భ‌య‌పెడుతున్నారు. ఇది నిజం.. మెగా ఫ్యామిలీ అంతా ఎందుకు దెయ్యాలుగా మారారో? ఎందుకు భ‌య‌పెడుతున్నారో తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. హాలోవెన్ ఫెస్టివల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అక్టోబర్ చివర్లో వచ్చే ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. దెయ్యాల్లాగా తమను అలంకరించుకొని ఈ పండుగను చేసుకుంటుంటారు. అయితే ఈ సంప్రదాయం ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చేసింది. సినీ ఇండస్ట్రీలోని పలువురు ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటుంటారు.
కాగా తాజాగా ఈ పండుగను మెగా ఫ్యామిలీ కూడా జరుపుకుంది. మెగాస్టార్ చిరంజీవితో సహా రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన, సుష్మిత, శ్రీజ, స్నేహ, నిహారిక మిగిలిన కుటుంబసభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో దెయ్యాల గెటప్‌లతో మెగా కుటుంబం అదిరిపోయింది. కాగా రామ్ చరణ్ ఒక్కటే ఏ వేషం వేసుకోకుండా కేవలం నల్ల దుస్తులను మాత్రమే వేసుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ఫాదర్‌గా, సుష్మిత నన్‌గా ఉన్న మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం మెగా కుటంబంలోని అందరు హీరోలు సినిమాలతో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాను ఒప్పుకోలేదు.

Share