క‌ర్నాట‌క ఫ‌లితాలు తారుమారు కాంగ్రెస్‌లో జోష్‌.. బీజేపీకి షాక్‌

ఏపీ టాప్ న్యూస్‌: క‌ర్నాట‌క‌లో శ‌నివారం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ రోజు వ‌చ్చాయి. అయితే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న భార‌తీయ‌జ‌న‌తా పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. బ‌ళ్లారి ఎంపీ సీటును పోగొట్టుకుని బొక్క‌బోర్లా ప‌డింది. ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బళ్లారి ఎంపీగా ఉండిన శ్రీరాములు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా పోవడంతో.. ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన చెల్లెలు శాంత బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసింది. ఈ సీటులో బీజేపీ ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ సంచలనం నమోదు చేసింది. బళ్లారి ఎంపీ సీటును సొంతం చేసుకుంది. ఇక మిగిలిన సీట్లలో కూడా కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్, జేడీఎస్ లు పొత్తుతో పోటీచేసిన నేపథ్యంలో రామనగర ఎమ్మెల్యే సీటును గెలుచుకున్నాయి. ఇక్కడ నుంచి సీఎం కుమారస్వామి భార్య అనిత విజయం సాధించింది. ఇక శివమొగ్గ ఎంపీ సీటును బీజేపీ సొంతం చేసుకుంది. ఈ సీటు నుంచి యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఎమ్మెల్యేగా వెళ్లడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆయన తనయుడు పోటీచేసి విజయం సాధించాడు. మండ్యా సీటులో కూడా బీజేపీ వెనుకబడింది.

Share