న‌క్క‌జిత్తుల బాబును జ‌నం న‌మ్మ‌రు

ఏపీ టాప్ న్యూస్‌: “ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు న‌క్క‌జిత్తుల మ‌నిషి. ఆయ‌న‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు“ అంటూ ఘాటుగా స్పందించారు మావోలు. మావోలు రాసిన లేఖ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌రేశ్వ‌ర‌రావును మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ను కాల్చి చంపాక మావోల‌పై తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆంధ్రా-ఒడిశా ఎస్.జడ్.సీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగబంధు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఘాటైన లేఖ రాశారు. దాదాపు 5 పేజీల లేఖ‌ను పాడేరులో మీడియాకు విడుద‌ల చేశారు. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజనుల అక్రమ అరెస్ట్ లు – నిర్బంధ‌కాండ‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని జ‌గ‌బంధు డిమాండ్ చేశారు. ఏపీలో నిర్బంధ పద్ధతులకు సీఎం చంద్రబాబు చరమగీతం పాడాల‌ని, బీజేపీకి వ్యతిరేకమంటూ చంద్రబాబు చేస్తున్న నక్కజిత్తులను ప్రజలు నమ్మరని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ ల పేరుతో బాబు ప్రజలపై దాడులు చేసి యువకులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. గిరిజనుల ఆస్తులు – ఇళ్లు ధ్వంసం చేస్తున్నార‌ని, రాసరాయి గ్రామంలో 26న అర్ధరాత్రి నలుగురు గిరిజనులను పట్టుకెళ్లిపోయారు.
బ్యాంకులకు వందల కోట్లు ఎగనామం పెట్టిన సుజానా చౌదరి వంటి నేరస్థులను చంద్రబాబు – డీజీపీ కాపాడుతున్నారని మావోయిస్టు ప్రతినిధి లేఖలో విమర్శించారు. ఇసుక – భూదొంగలు మద్యం మాఫియా గాళ్లకు ఏపీ ప్రభుత్వం రక్షణగా ఉందన్నారు. ఏజెన్సీ దమనకాండపై అన్ని రాజకీయ – స్వచ్ఛంద సంఘాలు నోరు విప్పాలని కోరారు. అక్టోబర్ 8న పెదబయలు మండలంలో గాయపడిన పోలీసుల విషయాన్ని ఎందుకు దాచారని నిలదీశారు. అక్టోబర్ 29న సీకుపనస గ్రామంలో ప్రజలు నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలతోనే ప్రజాగ్రహం పెల్లుబుకుతుందని హెచ్చరించారు.

Share