బాబు అందుకే భ‌య‌ప‌డుతున్నారు

ఏపీ టాప్ న్యూస్‌: తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిస్తే త‌న‌కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ క‌చ్చితంగా ఓడిపోవాల‌ని బాబు కోరుకుంటున్నారా? టీఆర్ఎస్ ఓట‌మి కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డానికైనా సిద్ధంగా ఉన్నారా? అంటే అవున‌నే అంటున్నారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి. టీఆర్ఎస్ ఓడిపోవాల‌ని బాబు ఎందుకు కోరుకుంటున్నారు? డ‌బ్బులు ఖ‌ర్చుపెట్ట‌డానికి ఎందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే విష‌యాల‌తో విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్ర‌బాబును జైల్లో వేస్తార‌ని, అందుకే టీఆర్ఎస్ ఓడిపోవాల‌ని బాబు కోరుకుంటున్నార‌న్నారు. అందుకే చంద్ర‌బాబు నాయుడు సంపాదించిన అవినీతి సొమ్మునంత పెట్ట‌డానికి కూడా బాబు వెనుకాడ‌డం లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ గాంధీతో చంద్రబాబు పూసుకు తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి అంతకుముందు ఆక్షేపించారు. జాతీయస్థాయి నాయకుడినని ఐటీ శాఖను బెదిరించాలని చూస్తున్నారని విమర్శించారు. చిదంబరం, రాబర్ట్ వాద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారని, రాహులేం కాపాడతారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్ని చేస్తున్నా టీఆర్ఎస్ గెలుస్తుందేమోన‌న్న భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంన‌ద్నారు. ఏనాటికైనా పాపం పండ‌క‌పోదు.. చంద్ర‌బాబు జైలుకు పోక త‌ప్ప‌ద‌ని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించారు.

Share