అడుగ‌డుగునా జ‌నంతో మ‌మేకం అలుపెర‌గ‌ని బాట‌సారికి బ్ర‌హ్మ‌ర‌థం

ఏపీ టాప్ న్యూస్‌: “ వైయ‌స్ జ‌గ‌న్‌.. ఈయ‌న వ్య‌క్తి కాదు ఒక శ‌క్తి. ఈ పేరు వింటే అధికార పార్టీ నేత‌ల్లో వ‌ణుకు. వాళ్ల‌కు కంటి మీద కునుకు దూర‌మై ఏడాది కావ‌స్తోంది“ అంటున్నారు తెలుగుదేశం పార్టీలోని కొంత‌మంది నాయ‌కులు, రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన నాటి నుంచి టీడీపీలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయ‌ని వారంటున్నారు. పీడిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిలుస్తూ .. ఆప‌న్నుల‌కు అండ‌గా కొండంత భ‌రోసానిస్తూ ముందుకు సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర సాగ‌కుండా టీడీపీ కుట్ర‌లు చేసింది అన్న‌ది ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన వాద‌న‌. స‌ర్కార్ ఎన్ని చేసినా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టి నేటికి ఏడాది అయింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌పై ప్ర‌త్యేక క‌థ‌నం.
వైయ‌స్ జ‌గ‌న్ వ‌జ్ర సంక‌ల్పానికి నేటితో ఏడాది అయింది. టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. బాధిత ప్ర‌జానీకానికి అండ‌గా నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చేందుకు చేస్తున్న `ప్ర‌జా సంక‌ల్పం` పాద‌యాత్ర సంవ‌త్స‌రం పూర్తి చేసుకుంది. వైయ‌స్‌జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నా .. పెద్దా.. పేదా గొప్పా.. కులం.. మ‌తం, పార్టీల‌కు అతీతంగా అంద‌రి క‌ష్టాల‌ను ఆయ‌న తెలుసుకుంటున్నారు. క‌ష్టాలు కొన్నాళ్లేన‌నిభ‌రోసానిస్తున్నారు. జ‌న‌నేత ప‌ల‌క‌రింపులతో జ‌నం మురిసిపోతున్నారు. అయితే ఈ క్ర‌మంలో క్షేత్ర స్థాయిలో ప్ర‌జా ప‌క్షాన నిలుస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోల‌క‌పోతున్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌లే ఈ కుట్ర‌లో ఉన్నారంటూ వారు మండిప‌డుతున్నారు. కుట్ర‌ల చీక‌ట్ల‌ను చీల్చుకుంటూ సంక‌ల్ప వెలుగుల‌తో మ‌ళ్లీ పాద‌యాత్ర మొద‌లు పెడ‌తార‌ని పార్టీ అభిమానులు అంటున్నారు. ఆయ‌న రాక కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నామంటున్నారు. అయితే ఇక్క‌డ ఒక‌టి క‌చ్చితంగా చెప్పాలి. ఏడాదిగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న నాయ‌కుడు బ‌హుశ దేశ చ‌రిత్ర‌లోనే కాదు.. ప్ర‌పంచంలోనే ఎవ‌రూ ఉండ‌రేమ‌!

Share