చంద్ర‌బాబు అంటేనే మోసం

ఏపీ టాప్ న్యూస్‌: “నాయ‌కుడు అనేవాడు ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాలి. ఏదైనా చెబితే అది ఎంత క‌ష్ట‌మైనా చేస్తాడ‌నే న‌మ్మ‌కాన్ని సంపాదించుకోవాలి. ప్ర‌జ‌ల కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉండాలి. అలాంటి వారిని ప్ర‌జ‌లుకూడా న‌మ్ముతారు. అలాంటి వారికే మ‌ళ్లీ ప‌ట్టం క‌డ‌తారు“ అని అంటున్నారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీష్‌రావు. తెలంగాణ ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామ‌ని చెబుతున్న హ‌రీష్ ఏపీలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌పై కూడా స్పందించారు. ఏపీలో త్వ‌ర‌లో జ‌రగ‌బోయే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చిత్తుగా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఆయ‌న ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దాన్ని బాబు నెర‌వేర్చ‌లేద‌ని, ప్ర‌జ‌లంద‌రినీ మోసం చేశార‌ని, అస‌లు మోసం అంటేనే చంద్ర‌బాబు నాయుడు అంటూ విమ‌ర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌లేక ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు క‌ప్పుకుని వ‌స్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడితో ఎవ‌రు పెట్టుకున్నా వాళ్లు ఎద‌గ‌లేర‌ని, కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి కూడా అంతేన‌ని, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని హ‌రీష్ రావు అంటున్నారు.

హామీలు ఇవ్వ‌డం మోసం చేయ‌డం చంద్ర‌బాబు నాయుడుకు అల‌వాటుగా మారిపోయిందని, ఆయ‌న వేసే ప్ర‌తి అడుగులో మోసమ‌ని,  ప్రతి పనిలో మోస‌మ‌ని, బాబు మాట్లాడేది చేయడు, చేసేది మాట్లాడడని,  ఆంధ్రప్రదేశ్ లో అందర్నీ మోసం చేసిన బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవ‌డం ఖ‌య‌మ‌ని అంటున్నారు. చంద్ర‌బాబు నాయుడికి సిగ్గులేద‌ని, నాడు సోనియా గాంధాని ఇట‌రీ దెయ్య‌మ‌ని అని, ఇప్పుడు ఆమె దేవ‌త ఎలా అయిందో ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌ని హ‌రీష్ డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు తెలంగాణ‌లో చెల్ల‌ని రూపాయి అని, అందుకే కాంగ్రెస్ ముసుగుతో వ‌స్తున్నార‌ని, బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇక్క‌డ ఒక్క సీటు కూడా గెలుచుకోలేర‌ని, తెలంగాణ‌లో టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రాబోతోంద‌ని హ‌రీష్‌రావు ధీమా వ్య‌క్తం చేశారు.

Share