సిట్ నివేదిక‌ను స‌మ‌ర్పించండి ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టు ఆదేశం

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం దాడి కేసుకు సంబంధించి ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక‌ను త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఏపీ స‌ర్కార్‌ను ఆదేశించింది. అయితే త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో లేని స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గించేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని హైకోర్టును వైయ‌స్ జ‌గ‌న్ కోరిన నేప‌థ్యంలో హైకోర్టు పై విధంగా స్పందించింది. కాగా దర్యాప్తు నివేదికను సమర్పించడానికి కొంత సమయం కావాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో, మంగళవారంలోపు సిట్ నివేదికను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌ విచారణ అర్హతపై హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఏపీ ప్రభుత్వం తరపు వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది వినిపించనున్నారు.

Share